సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో విచారణ ఎదురుకొంటున్న చంద్రబాబు తరపున లాయర్లు ఏపీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో .. ఇక ఫైనల్ గా ఎదో ఒకటి తేల్చుకునేందుకు ఈసారి సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే అయితే సుప్రీంకోర్టులో నేడు, బుధవారం ప్రారంభమైన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి సంబందించిన బెంచ్ లో ఉండటానికి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఖన్నా ప్రకటించారు. వచ్చే వారం బెంచ్ లో మరో జడ్జి తో కలసి క్యాష్ పిటిషన్ లో వాదనలు వింటామని ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా టీడీపీ శ్రేణులు మరో వారంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఏపీలో నారా లోకేష్ తాను అరెస్ట్ అయ్యి జైలుకు పోకుండా ఉండేందుకు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్‌ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *