సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్టు అయ్యి జైలు లో ఉండి 10 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ఫై నేడు, మంగళవారం హైకోర్టు లో నేటి సాయంత్రం వరకు రాష్ట్ర సి ఐ డి తరపున లాయర్లు మధ్య హోరాహోరీ సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిసాక .హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేసింది. దీంతోఈరోజు ఎంతో ఆశగా ఎదురుచూసిన టీడీపీ శ్రేణులు నిరాశ చెందారు.ఇక ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు తరఫున ప్రఖ్యాత లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, సి ఐ డి తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు సమర్ధవంతంగా వాదనలు వినిపించినట్లు ప్రకటించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ దృష్ట్యా చంద్రబాబు కస్టడీ పిటిషన్ సహా మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 21వ తేదీ వరకు ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది.
