సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అనారోగ్య కారణాలతో చికిత్సల కోసం 4వారాల గడువుతో జైలు నుండి షరతులతో కూడిన బెయిల్ ఫై బయటకు వచ్చిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తన నివాసం ఉన్న హైదరాబాద్ లో చికిత్సలు పొందుతు విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ గడువు ముగియగానే ఈ నెల 29 న తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య సమాచారం పై న్యాయవాదులు ఏపీ హైకోర్టు కు నివేదికను సమర్పించారు. నివేదికలో ఏం చెప్పారంటే.. ‘‘కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. గుండె సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారు. ఆయన గుండె పరిణామం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాల్లో సమస్యలున్నాయి. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహన్ని అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలి. స్కిన్ ఎలర్జీ పెరిగిందని కూడా వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో, 24 గంటల పాటు అంబులెన్స్‌లో ట్రెయిన్డ్ డాక్టర్ ఉండాలని వైద్యులు సూచించారు’’ అని న్యాయవాదులు నివేదికలో తెలిపారు
