సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు, మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గత 38 రోజులుగా జైల్లో ఉండటానికి కారణం వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులేనన్నారు. చంద్రబాబు ఫై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలు కేసులలో ఆయన తరుపు లాయర్లు ముందు బెయిల్ కోరకుండా అసలు విచారణే జరగకుండా కేసు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొన్నటివరకు చంద్రబాబు ఎండలో తిరిగి ఫిట్‌గా ఉన్నానని, ఇప్పుడు జైల్లో నీడలో ఉండి ఆరోగ్యం బాగాలేదనడం ఆందోళన కరంగా ఉందని కుటుంబసభ్యులు ప్రచారం చెయ్యడం అర్థం కాని విషయమన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏసీలు కావాలని కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు తప్ప, ఆయన్ని ఆస్పత్రిలో చేర్చమని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఇటీవల రామోజీరావుపై షేర్లు బదలాయింపు, తదితర విషయాలపై కేసు నమోదవడం ఇబ్బందికరం అని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *