సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో నేడు, శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ లో సమాజ హితం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కలువాల్సిందేనని, ప్రజల కోసం వారు ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రంగు పసుపు, జనసేన పార్టీ రంగు ఎరుపు కలిపితే కాషాయం రంగు ఏర్పడుతుంది. ఈ రెండు పార్టీలకు, ఆ BJPపార్టీ తోడు ఆటోమేటిగ్గా ఉంటుంది.. ఉండాలి కూడా అని కోరుకునే వారిలో తాను ఒకరిని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బీజేపీ నాయకుడు తరుణ్ చూగ్ సైతం ప్రస్తావిస్తూ… తమ దృష్టిలో ఈ అంశం ఉన్నదని చెప్పుకొచ్చారన్నారన్నారు . ఆవేశంతో అభిమన్యుడిలాగా కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్లి గతంలో వీరమరణం పొందితే పొంది ఉండవచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుడి లాగా తన వ్యూహాన్ని మార్చుకున్నారని టీడీపీ కలసి పొత్తుతో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకు పవన్ చక్కటి ప్రణాళిక చేసారు. ఇదే అర్జున విజయం. ఇంకా పవన్ కళ్యాణ్ ను అభిమన్యుడనుకుని, రెచ్చగొట్టే ప్రయత్నాన్ని తమ పార్టీ నేతలు చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా ఈరోజు విడుదలై ఘన విజయం సాధించడం ఖాయం. అని శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రఘురామా..
