సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు ఇటలీలో వివాహం చేసుకున్నా సందర్భముగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఇతర బంధు మిత్రులల్తో సహా గత వారం రోజులుగా ఆహ్లదంగా గడిపి తిరిగి నేడు, శనివారం హైదరాబాదు చేరుకున్నారు. అయితే వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ దంపతులు హైదరాబాదు చేరుకున్నారు. కొద్దీ విశ్రాంతి తరువాత పవన్ జనసేన కార్యకలాపాలలో బిజీ అయ్యారు, నేడు, శనివారం నాదెండ్ల మనోహర్ తో కలసి ఇటీవల 4వారాల షరతుల బెయిల్ ఫై ఇంటికి వచ్చిన చంద్రబాబు ను ఆయన నివాసం మర్యాద పూర్వకంగా లో కలుసుకొని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ రోజే ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నానని, శస్త్ర చికిత్స కొన్ని రోజుల తరువాత చేస్తామని డాక్టర్స్ సూచించారని చంద్రబాబు తెలిపారు. తాను జైలు లో ఉన్నప్పడు పవన్ కళ్యాణ్ స్వాందించిన తీరుకు కృతఙ్ఞతలు తెలిపినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *