సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసారని భీమవరం టిడిపి పట్టణ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న స్థానిక టీడీపీ నేతలు మెంటే పార్ధసారధి ఆధ్వర్యంలో ప్రతి రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో నేడు,శనివారం జనసేన పార్టీ తరఫున పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు జనసేన నాయకులతో వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు ను అక్రమంగా అరెస్టుచేసి రిమాండ్ ద్వారా జైలులో ఉంచి ఆనంద పడుతున్న వైసిపి ముఖ్యమంత్రి జగన్ తాను బెయిల్ ఫై వచ్చి 10 ఏళ్లు గడిచి రికార్డ్ సృష్టించిన జగన్ త్వరలో జైలుకి వెళ్ళడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కనకరాజు సూరి, చెనమల్ల చంద్రశేఖర్, సుంకర రవి, మోకా శ్రీనివాస్, కత్తుల నీలంద్ర, బండి రమేష్ ,MpTC లు గుల్లిపల్లి విజయలక్ష్మీ, యాల్లబండి ఇందిరా , వెంకట లక్ష్మీ, తాతపూడి రాంబాబు, మాజీ కౌన్సిలర్స్ మగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, నాయకులు రామాయణం శ్రీనివాస్,దారపురెడ్డి త్రివిక్రమ్ ,, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు
