సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, ఆదివారం ఢిల్లీ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు గత శనివారం నాడు కలిశారని, ఇకపై కలిసే ఉంటారు. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే, వాటిని పటా పంచలు చేసుకోండి. పదవులు కాదు, వారికి ప్రజలే ముఖ్యం. ప్రజలను కాపాడుకోవడానికి కలిశారని అన్నారు. ఈ కలయిక వల్ల నెల్లూరు జిల్లా నుంచి కోస్తా మీదుగా శ్రీకాకుళం వరకు తీర ప్రాంతమంతా తమ పార్టీ సముద్ర గర్భంలో కలిసి పోవాల్సిందేనని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మూలాలు బయటకు వస్తున్నాయి. ఇంకొంచెం బయటకు వస్తే, రాయలసీమలోనూ తమ పార్టీ పరిస్థితి అధ్వానం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ రాయలసీమలో .బిజెపి సానుభూతిపరులు కూడా తమ ద్వితీయ ప్రాధాన్యత ఓటు టిడిపి అభ్యర్థులకు వేసి వారి గెలుపుకు చిరు దోహదం చేశారు. వై నాట్ 175 కాదు 1+7+5 కే తమ పార్టీ పరిమితం అవుతుంది. ప్రజలను ఇలాగే అరెస్ట్ చేసి హింసించి, చంపే ప్రయత్నం చేస్తే, ఆ 13 స్థానాలు కూడా దక్కవు. మూడు చోట్ల చంద్రబాబు పై రాళ్ల దాడి చేయించారని … పవన్ కళ్యాణ్ ను హోటల్ నుంచి అడుగు బయట పెట్టనివ్వని పరిస్థితి కల్పించారని వీటికి ప్రజలు వచ్చే ఎన్నికలలో గుణపాఠం చెపుతారని విమర్శించారు.
