సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం జగన్‌పై కరెంట్ తీసి ఒక ప్రణాళిక ప్రకారం పువ్వులు విసురుతున్నపుడు రాయితో కంటి పైన దాడి చేసి గాయపరిచిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. అయితే మరుసటి రోజే నేటి రాత్రి గాజువాక లో ప్రచారంలో ఉన్న చంద్రబాబుపై ఆయనకు దూరంగా ఒక రాయి వెళ్లటంతో అక్కడున్న తెలుగు తమ్ముళ్లు రాయి విసిరిన ఆకతాయిలను పట్టుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుల వైఫల్యంతోనే ఈఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే నేడు తెనాలి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ నుంచి దిగాక ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అది ఆయనకు తగలకుండా కొంత దూరంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జనసైనికులు నిందిత వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏది ఏమైనా ప్రచారంలో ఉన్న నేతలపై రాళ్లతో దాడులు సంస్కృతీ మొదలు పెడితే పార్టీ అధినేతలు కన్నా క్షణికావేశంలో దాడులకు పాల్బడిన వ్యక్తులు వారి కుటుంబాలే ఎక్కువ బాధితులు అవుతారని తెలుస్తుకోవాలి.
