సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాపట్ల జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ప్రజలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, వారి దత్తపుత్రుడు, పచ్చమీడియా తట్టుకోలేక పోతున్నారన్నారు.రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బాగుండాలని పని చేస్తున్నానని… కానీ చంద్రబాబుకు ఎన్నికలకు ముందు మాత్రమే వారు ఓట్లు కోసం గుర్తుకు వస్తారన్నారు. చంద్రబాబుకు, తనకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని అన్నారు. ‘‘నేను మిమ్మల్ని, దేవుడిని మాత్రం నమ్ముకున్నా… ప్రజలకు మంచి చేయని చంద్రబాబు, దత్తపుత్రుడు పొత్తులను నమ్ముకున్నారు. పొత్తులను, ఎత్తులను, జిత్తులను, కుట్రలను నమ్ముకున్నారు. 14 ఏళ్ల సీఎం గా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తు రాదు. కేవలం చంద్రబాబు అంటే వెన్నుపోటు మాత్రమే గుర్తుకు వస్తుంది. దత్తపుత్రుడు రెండు సినిమాల మధ్య విరామంలో వస్తారు. విరామంలో వచ్చి పొలిటికల్ మీటింగ్ పెట్టి వెళ్తారు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మీ బిడ్డపై నాలుగు రాళ్లు వేసి పోతాడు. ఇలాంటి వారు ప్రజలకు మేలు చేస్తారా? ఆలోచించాలి. అధికారంలో ఉంటే అమరావతి, అధికారంపోతే హైదరాబాద్, జూబ్లీహిల్స్ వారికి నివాసం. పదవి లేకపోతే ఇక్కడ ఉండాలనే ఆలోచన కూడా వీరికి తట్టదు. నేను ప్రతిపక్షంలో ఉండగా తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొన్నాను. ఐతే.. చంద్రబాబు మాత్రం ఏపీలో సీఎంగా ఉండగా హైదరాబాద్‌లో ప్యాలెస్ కట్టుకున్నాడు. మన రాష్ట్రంలో దోచుకోవటం, దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో నివాసం ఉండడం వీరి పని’’ అంటూ సీఎం జగన్ విమర్శించారు.
