సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇసుక పాలసీ పునః సమీక్షించాలి.. ‘పేరుకు ఉచిత ఇసుక .. ఎగుమతుల ఖర్చులు తడిపి మోపెడు’ అవుతున్నాయి. ఇసుక అతి సమీపంగా దొరికే ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజలకే ఇసుక ఇబ్బందులు తప్పటంలేదు వర్ష కాలం లో గోదావరి వరద ఉద్రితికి ఇసుక తియ్యడం కుదరని పని అని ముందుచూపుతో అధికారులు గత ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంపుల వద్ద కొండలుగా సిద్ధం చేసిన ఇసుక ఇప్పుడు ఎక్కడ కానరావడం లేదు. అరకొర ఇసుక కు డిమాండ్ పెరిగిపోయింది. వర్షాలు జోరు అందుకొన్నాయి. మరో ప్రక్క గోదావరి లో ప్రవాహం తగ్గితేగాని ఇసుక బయటకు తీసే పరిస్థితి లేదు. ఒకొక్క లారీ ఇసుక ర్యాంపుల దగ్గర ఒకటి 2 రోజులు కూడా నిలచిపోవాల్సిన పరిస్థితిలు కనపడుతున్నాయి. అయితే ఇటీవల నిబంధలు పేరుతొ తమను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఇసుకను సరఫరా చేసే టిప్పర్‌ లారీలు సమ్మె విరమించడం తో కాస్త పరిస్థితి మెరుగుపడుతుంది. గత ఐదు రోజులుగా సుమారు 2000 లారీలు టిప్పర్లు సమ్మెలో పాల్గొనడంతో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇసుక సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుకను ఆధార్‌ కార్డుతో ఇవ్వడానికి సంబంధిత అధికారులు అనుమతించడంతో గత మంగళవారం నుంచి ఇసుక ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఐదు యూనిట్ల లారీకి 20 టన్నుల ఇసుక ఎగుమతి అవుతంది. అంటే కిరాయితో కలుపుకుని ఇసుక వినియోగదారనికి చేరు సరికి 5 యూనిట్లు రూ. 16నుంచి 20 వేలు ఖర్చు అవుతుంది.. దీనిపై తక్షణం ప్రభుత్వం చొరవ చూపాలి. అధికార అండతో కృతిమ కొరత సృష్టిస్తున్న పెద్దలపై చర్యలు కు సిద్ధం కావాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *