సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో నేటి బుధవారం రాత్రి తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద స్థలం లేని రోడ్డు లో పెట్టిన బహిరంగ సభలో , కార్యకర్తలు, ప్రజలు మధ్య జరిగిన త్రొక్కిసలాటలో గుండంకట్ట ఔట్‌లెట్ మురుగు డ్రైన్ లో కార్యకర్తలు జారిపడిపోయారు. బయటకు రావడానికి కంగారులో ఒకరిని ఒకరు తోకేసుకొన్నారు. ఈ ఘటనలో నేటి రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. 8 మంది మృతి చెందగా మరో 4 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు.చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎదో తమ నాయకుడి ని చూడాలని వచ్చి ప్రాణాలు పొగగొట్టుకొన్న వారి కుటుంబాల పరిస్థితి దుర్భరం.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానెల్స్ లో హల్ చల్ చేస్తుంది.
