సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ఢిల్లీ లో నేటి బుధవారం రాత్రి బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్న నేపథ్యంలో .. బీజేపీకి ఏపీలో 6 లోక్ సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని వస్తున్నా వార్తల నేపథ్యంలో ఏపీ పొత్తు రాజకీయాల్లో తాజా పరిణామాలపై మంత్రి అంబటి రాంబాబు నేటి సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలాంటి వాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. తన అవసరానికి అందర్నీ వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్న తో పెట్టిన విద్య. ప్రధాని మోడీని తిట్టడం , అమిత్ షా కారుపై రాళ్ళూ చెప్పులతో దాడి చేయించింది. బీజేపీ వాళ్లు మరిచిపోవచ్చే మోగానీ.. ప్రజలు మాత్రం మరిచిపోరు. ఎన్ని పార్టీలతో చంద్రబాబు కలిసి వచ్చిన ‘మా వైసిపి టార్గెట్ 175 కు 175 సీట్లు గెలవటం మీద ఉంది. ఇక్కడ ప్రజలకు పరిస్థితి అర్ధం అయిపొయింది. చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ తో ఉండి మరొకవైపు బీజేపీ వాళ్ళు వద్దు వద్దు అంటున్న మరోసారి ఢిల్లీ పరిగెత్తికెళ్ళడంటే.. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా బలంతో ఎంత బలంగా ఉన్నాడో వారికి అర్థమవుతోంది. వైసిపి కి 55% పైగా ఓటింగ్ ఉంది. అంటే ఈసారి వారి కూటమి ఫెయిల్ అవ్వటం పక్క ఖాయం అని అంబటి జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *