సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీం కోర్టులో స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ ఇవ్వడం ఫై దానిని రద్దు చెయ్యాలని రాష్ట్ర సీఐ డి దాఖలు చేసిన పిటిషన్ ఫై నేడు, విచారణ జరిగింది. దీనిపై సుప్రీం కోర్ట్ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని దానికోసం ఈ కేసును వచ్చే డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసినట్లు ప్రకటించింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. అయితే రాజకీయ సభలు ర్యాలీలు, ఫై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలు పాటించాలని , అలాగే స్కిల్ స్కాం కేసు గురించి విచారణ పూర్తీ అయ్యేవరకు చంద్రబాబు బహిరంగంగా ఎక్కడ వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.
