సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నేడు, శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మహిళా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఐదేళ్లలో తప్పుడు మాటలు చెప్పి అందరినీ నమ్మించారని మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నెరవేర్చలేదన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. ఇటీవల జగన్ బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదన్నారు. 50 రోజుల పాటు మాహా శక్తి పథకాలపై ప్రచారం ఉంటుందని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 160 సీట్లలో విజయం సాదిస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భముగా అచ్చెన్నాయుడు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. అంటే అధికార వైసిపి ని హెచ్చరించడం కంటే టీడీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుంది అని సంకేతమే కదా? జనసేన తో పొత్తు కు అచ్చెన్నాయుడు దూరం..? గతంలోనూ ఇదే కామెంట్స్ చేసారు.అయితే ఇటీవల పవన్ దూకుడు వైఖరిని తప్పు పడుతూ.. జనసేన తో పొత్తు కు దూరం అంటూ అచ్చెన్నాయుడు రాసినట్లుగా ఒక ఫేక్ పత్రం? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ప్యూహాత్మక రాజకీయ ఎత్తులలో ఒక భాగమా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *