సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పార్టీ భవిషత్తు దృష్ట్యా ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఎన్నికలలో గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అటు బీజేపీ తోనూ, ఇటు జనసేన తో కలసి వెళ్లాలని ప్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సత్పలితాల మాట దేవుడు ఎఱుగు ? అది పార్టీ భవిషత్తు కు మంచిది కాదని..ఇటీవల పలువురు నేతల ధిక్కరధోరణి తో.. కొన్ని ప్రాంతాలలో పార్టీక్యాడర్ తెలంగాణ తరహాలో ప్రక్క పార్టీలవైపు చూస్తున్నాయని సంకేతాలు రావడంతో..చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకొన్నారు. ఇక ప్రజలలో పార్టీలో చులకన కాకుండా బలమైన పార్టీ అధినేతగా కఠిన వైఖరితో .. సీఎం జగన్ తరహాలోనే… తాడో.. పేడో.. తన పార్టీ లో స్వంత బలాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లాలని.. పొత్తులు .. మార్పులు గురించి తరువాత ఆలోచించాలని నిర్ణయించినట్లు తాజగా ఆయన వైఖరి తో స్వష్టం చేసారు. నేడు, సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఇక పొత్తుల ప్రస్తావన లేకుండా కొందరు టీడీపీ నేతలనుద్దేశించి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. పనిచేయకుంటే కచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. తప్పుకునే వాళ్లు ఇప్పుడే తప్పుకుంటే వారిస్థానంలో వేరేవాళ్లను ప్లాన్ చేస్తాం. నేనేమీ గట్టిగా మాట్లాడటం లేదు అనుకోవద్దు. .. పనిచేయకుంటే యాక్షన్ మాత్రమే తీసుకుంటానని చెబుతున్నాను’ అని తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు హెచ్చరించారు.
