సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ నుద్దేశించి నువ్వు నిజంగానే రాయలసీమలోనే పుట్టావా? డి ఎన్ ఏ అని లోకేష్ అడుగుతున్నారని…జగన్ రాయలసీమ పులి ఇక్కడే పుట్టాడని దేశానికీ తెలుసునని లోకేష్ మాత్రం హైదరాబాద్ లో పుట్టి అక్కడే చదివి, అక్కడే బ్రతుకుతున్నాడని ఇప్పటికి తండ్రి తో కలసి అక్కడే ఉంటాడని అందరికి తెలుసునని , కరోనా సమయంలో తండ్రి కొడుకులు ఏపీ ప్రజలను మరచిపోయి హైదరాబాద్ లోనే ఉండిపోయారని అసలు ఏపీ తో లోకేష్ కు ఏమిటి సంబంధం..? తెలంగాణలోనే ఎక్కడో పోటీ చెయ్యవచ్చుకదా? లోకేష్ ది ఒక పాదయాత్ర .. ఒక లీడర్ .. అందరు నవ్వుకొంటున్నారు..మరి జగన్ ను ఇటువంటి మాటలు అంటారు.. వీళ్ళను ఏమైనా అంటే చంద్రబాబు తన ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టారని బోరున ఏడుస్తాడు.. వీళ్ళతో కలసి కొందరు పకోడీ గాళ్ళు కూడా నన్ను బూతులు తిడుతు.. పిచ్చ రాతలు రాస్తారు. మరి భారతమ్మ ను ఎందుకు వివాదాలలోకి లాగుతారు? వీళ్ళ ఇంట్లో ఆడవాళ్లకే గౌరవం ఇవ్వాలా ? లోకేష్, చంద్రబాబు పిచ్చ బాషా అందరు చూస్తున్నారు . రాష్ట్రంలో దారిద్ర పాలన అంటున్నారు. మరి చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి దరిద్రం పట్టించారని విమర్శించారు. 2 ఎకరాల చంద్రబాబు ఇప్పడు 2 లక్షల కోట్ల అవినీతి చక్రవర్తన్నారు. అది స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పారన్నారు. జగన్‌ను సైకో అంటోన్న చంద్రబాబే ఓ పెద్ద సైకో అన్నారు… పిల్లనిచ్చిన మామ.. పార్టీ పెట్టిన పెద్దాయన నుండి పార్టీ ని ఆ పార్టీ నిధులను సీఎం పదవిని దొంగిలించి .. చెప్పులతో కొట్టించి పెద్దాయనను బయటకు గెంటేసిన చంద్రబాబు కన్నా సైకో నా .. ఎవరు ఉంటారు? ‘చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలి. నా నియోజకవర్గానికి రా…. మీ సంగతి తేలుస్తా ? భారతమ్మ పేరు ఎత్తితే వారి సంగతి చెబుతానని హెచ్చరించారు.
