సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే తెలంగాణ ఎన్నికలలో ముందు చూపుతో 2చోట్ల పోటీ చేస్తానని ప్రకటించిన కెసిఆర్ బాటలోనే.. ఏపీలో చంద్రబాబు కూడా ఫాలో అవ్వబోతున్నారని లీక్ లు వస్తున్నాయి. వచ్చే 8 నెలల తరువాత జరగనున్న ఎన్నికలలో ఈసారి ఆయన కుప్పం తో పాటు కృష్ణ , గుంటూరు జిల్లాల పరిధిలో ఎదో ఒక సురక్షితమైన నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యే గా గెల్చిన తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలలో, జెడ్ పి. ఎంపీటీసీ, నగర పంచాయితీ ఎన్నికలు, మొదటి మున్సిపల్ ఎన్నికలు ఏవైనా సరే.. ఆఖరికి ఇటీవల జరిగిన ఉప పంచాయితీ ఎన్నికలలో సైతం అక్కడ వైసిపి అభ్యర్థులు విజయపరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి కుప్పం చంద్రబాబును ఓడించి భారీ షాక్ ఇవ్వాలని మంత్రి పెద్ది రెడ్డ్ ప్యూహంలో వైసిపి శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయి.ఇక కుప్పం వైసిపి ఇన్ చార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన సీఎం జగన్.. చిత్తూరు జిల్లా వైసిపి పార్టీ అధ్య క్ష పదవిలో కూడా కొనసాగిస్తూ .. చంద్రబాబు ను ఓడించి కాబోయే కుప్పం ఎమ్మెల్యే గా, కాబోయే మంత్రి గా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జోరుమీదుంది. దీనితో చంద్రబాబు కూడా వాస్తవం దృష్టితో అలోచించి కుప్పంలో ఇల్లు కట్టుకొంటున్నాను అని ప్రకటించిన పెద్ద మార్పు రాకపోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ని బలోపేతం చెయ్యవలసిన సమయంలో కుప్పం మీదే ద్రుష్టి పెట్టడం సరికాదని భావించి.. మరో కోణంలో టీడీపీకి బలమైన అంగ అర్ధ బలం ఉన్న విజయవాడ , గుంటూరు ఎంపీలు అయిన కేసినేని నాని, గళ్ళ జయదేవ్ కూడా పార్టీ కి దూరంగా ఉంటున్న( వారు లోకేష్ పాత్ర యాత్ర కు దూరంగా ఉన్నారు) నేపథ్యంలో ఆ ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాలని తాను పోటీ చెయ్యడానికి ఇక ఆ ప్రాంతంలోనే 2వ నియోజకవర్గం ఫై ద్రుష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *