సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మహానాయకుడు ఎన్టీఆర్‌కు శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో తాడిగడపలోని అనుమోలు గార్డెన్స్‌లో గత రాత్రి ఆయన అభిమానులు, చంద్రబాబు, బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీరాజనాలు అర్పించారు.చంద్రబాబు, బాలకృష్ణ ఎన్టీఆర్ ను యుగపురుషుడు గా కొనియాడారు. అయితే కారణాలు ఏవైనా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. అయితే తమిళ తలైవా రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు కార్యకర్తలు జై ఎన్టీఆర్ .. జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భముగా తాను చుసిన మొదటి చిత్రం పాతాళ బైరవి, తాను హీరోగా నటించిన మొదటి చిత్రం బైరవి నుండి ఎన్టీఆర్ తో కలసి నటించిన టైగర్ సినిమా విశేషాలను అభిమానులతో చక్కటి తెలుగులో పంచుకొన్నారు. కేవలం 9 నెలలో తెలుగుదేశం పార్టీ ని పెట్టి, ఎండనక వాన అనక రాష్ట్రంలో వాడవాడలా తిరిగి ఎంతో కస్టపడి అధికారంలోకి తెచ్చిన దేశంలో ఏకైక మొనగాడు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని రజనీకాంత్ తెలియజేశారు. ఇక ఈ సభలో రాజకీయాలు మాట్లాడకూడదు అని అనుభవం చెబుతుందని.. మాట్లాడితే వాళ్ళ పేపర్ లో ఎదో వస్తుంది అని తెలిసిన కొద్దిగా రాజకీయం మాట్లాడతానని .. చంద్రబాబు గొప్పతనం అంతా ఇంతా కాదని.. గొప్ప విజన్ ఉన్న ప్రపంచ స్థాయి నేత అని , హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిద్దినది, ఈ రోజు తెలుగువారు విదేశాలలో లక్షలు సంపాదిస్తున్నారంటే చంద్రబాబు విజన్ మాత్రమేనని , ఇక బాలకృష్ణ మహా కోపిష్టి అని కానీ మనస్సు పాలు లాగా స్వచ్ఛముగా ఉంటుందని, తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను బాలకృష్ణ లో మాత్రమే చూసుకొంటున్నారని., రామోజీ రావు గొప్పతనాన్ని కొనియాడారు. అయితే అక్కడ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లను ప్రదర్శిస్తున్న అయన గురించి కానీ ఆస్కార్ సాధించిన సినిమా గురించి రజనీకాంత్ ప్రస్తావించక పోవడం అభిమానులలో చర్చనీయాశం అయ్యింది,
