సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కు కంటి ఆపరేషన్ చేయించవలసిన అవసరం..రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు నిర్ధారించడంతో తదితర అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ హైకోర్టు 4వారలు పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన నేపథ్యంలో .. బాబు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని టీడీపీ కీలక నేతలు, శ్రేణులు, రాజమండ్రి చేరుకోవడంతో నగరం అంతా కోలాహలంగా ఉంది. జైలు లో అధికారులు ఆయనకు బెయిల్ షరతులు వినిపించిన తదుపరి.. సాయంత్రం 4-40 గంటలకు ఆయన బయటకు వచ్చి టీడీపీ శ్రేణులకు నమస్కారం చేసారు ( పైన తాజా చిత్రంలో చూడవచ్చు).. రాజమండ్రి జైలు నుంచి బయటికి రాగానే.. యన అక్కడ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తూ .. నా కష్టకాలం లో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని, గత 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూపిం చిన అభిమానం ఎప్ప టికీ మర్చి పోలేను. నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. చేయనివ్వను.అన్నారు. నా కోసం కొందరు బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్ట్ నేతలు, తో పాటు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికీ కృతఙ్ఞతలు అన్నారు. నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఇవాళ రాత్రికి చంద్రబాబు విజయవాడకు రానున్నారు. తదుపరి రేపు బుధవారం సాయంత్రానికి బాబు తిరుమల చేరుకోనున్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చంద్రబాబు కంటి పరీక్షలు, చికిత్సలు చేయించుకుంటారని టీడీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
