సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత మంగళవారం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోడీని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నిలదీస్తూ చంద్రబాబు ఫై తీవ్ర ఆరోపణలు చేస్తూ వ్యంగంగా మాట్లాడిన మాటలు వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. .టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కి లోక్ సభలో బీజేపీ పూర్తీ బలం సాదించలేకపోయిన ఇటీవల ఎన్డీయే లో కలుపుకున్న నితీష్ కుమార్, చంద్రబాబు పార్టీలను రెండు ఉతకర్రల సాయంతో అధికారం చెలాయిస్తుందని మండి పడ్డారు. ఏపీలో అవినీతి పరుడుగా కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు, మోడీ తో కలవగానే సత్యవంతుడు ఎలా అయ్యాడని, అవినీతి కేసులో అరెస్ట్ అయిన అతని ఫై కేసులు ఎందుకు కదలటం లేదని ప్రశ్నించారు. మోడీ ఏమైనా బట్టలు ఉతికే వాషింగ్ మిషనా ? అతనితో కలవగానే అవినీతి మురికి వదిలిపోవడానికి.. గత నెలలో ఎన్నికల ఫలితాలు వేళా షేర్ మార్కెట్ కుప్ప కూలి అందరు నష్టాలలో ఉంటె.. చంద్రబాబు భార్య భువనేశ్వరి దేవి మాత్రం ఒక్క రోజులో 521 కోట్ల పైగా లాభాలు ఆర్జించింది ప్రకటించారు. ఇది ఎలా సాధ్యం.. దీనిపై ఎందుకు కేంద్రం విచారణ చేప్పట్టలేదు? ఎందుకని ఈడీ ని రంగంలోకి దించలేదు. అని ప్రధాని మోడీ ని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐతో పలువురు రాజకీయ నేతలను బెదిరించి బీజేపీ లొంగదీసుకుంటుందని ఆరోపించారు. దీనిలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని, బీజేపీ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ఎన్డీయేలో చేర్చుకుందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, తమ నాయకుడిపై సీఐడీ పోలీసులతో గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించిందని, సమాచారలోపంతో బెంగాల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
