సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి 33 రోజులు అయ్యాయని దీనిని అక్రమ కేసు అని ప్రచారం చేస్తున్న టీడీపీ సానుభూతి పరులు వాస్తవాలు గమనించాలని అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి నేడు, బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో 300 కోట్లు అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబు ను జైలు రిమాండ్‌కు పంపించిందని అన్నారు.ఇదే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసిందన్నారు. అయితే స్కిల్ కేసులో అసలు సూత్రధారి చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ అధికారులు విచారణ చేసి అరెస్టు చేశారని, పత్రాలపై సంతకాలు చేసి ఆధారాలతో చంద్రబాబు దొరికేసాడు కనుకే.. కేసు విచారణ జరగకుండా క్వాష్ పిటిషన్ వేసి చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని మాత్రమే 17ఏపై వాదిస్తూ.. కేసు కొట్టేయించాలని చూస్తున్నారన్నారు. తాను నిజంగా అవినీతి చెయ్యకపోతే కోర్టు విచారణలో చంద్రబాబు నిరూపించుకోవచ్చునని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేని దానికి కుట్ర ఏముందని నారా లోకేష్ అంటున్నారని, మరి అక్కడే హెరిటేజ్ భూములు ఎందుకు కొన్నారని సజ్జల ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఎందుకు వున్నారని నిలదీశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబుని అరెస్టు చేస్తే తమకు ఏమి వస్తుందన్నారు. బాబు ఇంకా నాలుగు సభలు పెడితే వైసీపీకి నాలుగు ఓట్లు వస్తాయన్నారు. లోకేష్ ఢిల్లీలో కూర్చునే బదులు ప్రజల్లో తిరగవచ్చు కదా అని సజ్జల అన్నారు. బీజేపీలో ఉన్నా పురంధరేశ్వరి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ఆమె మద్యంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరడం విచిత్రంగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *