సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కుప్పం పట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తూ తెలుగుదేశం కార్యకర్త ఒకరు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రామకుప్పం మండలం ఆనిగానూరుకు చెందిన చలమయ్య (38) గత సోమవారం రాత్రి మితుడు నాగభూషణంతో కలిసి బస్టాండ్ వద్ద జరిగిన సభకు వచ్చారు.అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతుండగా కుప్పం మండలం గుట్టపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చలమయ్య దుర్మరణం చెందగా నాగభూషణం పరిస్థితి విషమంగా ఉంది. హాస్పటల్ లో క్షతగాత్రుడిని నేడు మంగళవారం ఉదయం చంద్రబాబు పరామర్శించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. చలమయ్య కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
