సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు ప్రధాన మార్కెట్ లో గత రాత్రి అనుకున్న సమయం కన్నా బాగా ఆలస్యంగా జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు, వేలాది సంఖ్యలో స్థానిక ప్రజలు ,రఘురామా మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అవ్వటంతో చంద్రబాబు ఆనందానికి అవధులు లేవు. అదే సభలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఐదేళ్లుగా జగన్ సైకో పాలనలో రఘురామను ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో గమనిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని అనిపిస్తుందన్నారు. ఒక ఎంపీని చిత్రహింసలకు గురిచేసి తన పార్లమెంట్ నియో జకవర్గంలోకి రాకుండా జగన్ అడ్డు పడ్డాడని విమర్శించారు. కూటమి ఏర్పాటు కు రఘురామా చేసిన కృషి ని అభినందించారు. ఆయనకు పార్టీ మంచి స్థాయిలో గౌరవిస్తుందని ప్రకటించారు తప్ప ఎంపీ గాన ?ఎమ్మెల్యే గా? బరిలో దింపేది ప్రకటించలేదు. అదే వేదికగా బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కూడా ఉండటం విశేషం..రాష్ట్రభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలవడం జరిగిందని బాబు చెప్పారు.తాము అధికారంలోకి వచ్చాక పాలకొల్లులోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని హర్షధ్వానాల మధ్య బాబు హామీ ఇచ్చారు.టీడీపీ పార్టీలో చేరిన రఘురామా చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలుపుతూ.. తనను జైలు లో చిత్ర హింసలు పెట్టినప్పుడు చంద్రబాబు తన కుటుంబానికి అండగా ఉన్నారని ఆయనకు తాను రుణపడి ఉన్నానని అన్నారు.
