సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ సినిమా గతిని , సినిమా తీసే రీతిని మార్చిన వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కూడా ఎప్పుడు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. తన చిత్రాలలో అచ్చు గుద్దినట్లు ఉండే పాత్రదారులతో ముఖ్యంగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే.. తాజాగా టీడీపీ అధినేత చం ద్రబాబు పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలుపుతూనే నేడు ఒక పాట రిలీజ్ చేసాడు. చంద్రబాబు ను .. సిక్కో సైకో అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సాంగ్ను ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందిం చినట్లు ట్వీ ట్లో వెల్లడిం చారు. ఈ పాటలో చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ఉండి మామ ఎన్టీఆర్ కు సవాల్ విసరటంతో ప్రారంభం అయ్యి ఆ తర్వాత అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్ను వెన్ను పోటు పొడవడం.. పచ్చ మీడియా సహకారంతో ఎన్టీఆర్ పార్టీని దొబ్బేసాడు.. బాబుకు బావలు బాంచన్ అన్నారని వ్యాఖ్యానాలతో పాడటం జరిగింది. జగన్ సైకో అనే చంద్రబాబు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అతడు అంతటి సిక్కో -సైకో అందరికి తెలుస్తునని..కానీ ఆ విషయం అతనికే తెలియకపోవడం అతని దురదృష్టం అని వర్మ వ్యాక్యలు కూడా జోడించాడు. ఈ పాట కొద్దీ క్షణాలలో ఆగమేఘాల మీద లక్షలాది మందికి వైరల్ అయ్యింది.
