సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం ఉదయం స్థానిక 37వ వార్డులో కొత్తగా నిర్మించిన 3 సిసి రోడ్లను ప్రారంభించిన తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ మీటింగ్ లో మాట్లాడుతూ తనపై తన ఆస్తులపై దారుణమైన ఆరోపణలు చేసారని, భీమవరంలో తాను 60 కోట్ల తో ప్యాలస్ కట్టుకొంటునని, అనేక భూములు కబ్జా చేసానని ప్రకటించారని.. నేను ఇప్పటి వరకు స్వంత ఇల్లు లేక నా సోదరుల ఇంటిలో ఉంటున్నానని, వయస్సు 60 ఏళ్ళు సమీపిస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు నా తాతలు ఇచ్చిన స్థలంలో బ్యాంకు లోను తీసుకోని ఇల్లు కట్టుకొంటుంటే.. ఇక్కడ నాయకులూ కొందరు ఓర్వలేక ‘ప్యాలస్’ కడుతున్నాని ఈర్ష్య తో ప్రచారం చేస్తున్నారని, దానిని చంద్రబాబు సైతం ఇప్పుడు ప్రచారం చెయ్యడం దారుణమని మీకు మల్లె ప్యాలస్ లు నిర్మించ లేనని ఎందుకు మీరు 30 కోట్లు ఇప్పించండి ఆ ఇల్లు మీకు అమ్మేస్తాను అని సవాల్ చేసారు. ఇంకా నేను భూములు ఆక్రమించానని ఆధారాలు ఉంటె చూపించాలని అంతే కానీ మీరు అవినీతి పరులని అందరు అదే బాటలో ఉంటారని అనుకోవద్దని.. నాకు భీమవరం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పని చెయ్యడం మాత్రమే తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *