సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత, నారా చంద్రబాబుగత 11 రోజులుగా జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో వైపు ఆయనను 5రోజుల సీఐడి కస్టడీ కి అప్పగించాలని వేసిన పిటిషన్పై తీర్పు కోసం నేటి సాయంత్రం వరకు అందరు ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ ఏసీబీ కోర్టు మరోసారి తీర్పు ను రేపటి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. తాజా వార్త సమాచారం మేరకు..హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్లో ఉన్నందున కస్టడీ పిటిషన్పై తీర్పును వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. రిమాండ్ ముగుస్తున్నందున కస్టడీ ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. ఆర్డర్ ఇప్పుడు ఇస్తే… రేపు హైకోర్టులో విచారణలో ఉన్న స్క్వాష్ పిటిషన్ బట్టి చర్యలు తీసుకుంటామని సీఐడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
