సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 27,28 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడంతోపాటు,వారి జియో-కో ఆర్డినేట్స్‌ నమోదు చేస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికీ 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకి అభినందనలు వ్యక్తం చేస్తున్నారన్నారు.చంద్రబాబు 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, ఆత్మవిశ్వాసం అనే పదాలకు నిర్వచనంగా నిలిచారన్నారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ 10 వేల కోట్లకు మించి కేటాయించలేదని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, బాలిక విద్యా విధానం, మహిళలకు దీపం పథకం, బీసీల కులవృత్తులకు గౌరవం కల్పిస్తూ ఆదరణ పథకం అమలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మైలబత్తుల ఐజాక్ బాబు, విజ్జురోతు రాఘవులు, పాపాలు ఏడుకొండలు,లంకి శ్రీనివాస్ గొలగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *