సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎప్పుడు వార్తలలో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎవరు ఊహించని మరో సంచలనం చేసారు. కందుకూరు లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నిర్వహించిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎనిమిది మంది మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని, ఆయన రాజకీయాల కోసం 8 మంది మృతికి కారణమయ్యారని,ఆరోపిస్తూ బాధితుల కుటుంబాలకు తీరని లోటు జరిగిందని అందుకే దీనికి కారణమైన చంద్రబాబు ను విచారించి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. అధికార వైసీపీ కన్నా దూకుడుగా కే ఏ పాల్ కందుకూరు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు అసలు దోషి అంటూ పిర్యాదు చెయ్యడం నిజంగా సంచలనమే..
