సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన లక్షలాది మంది పార్టీ క్యాడర్ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో 175 కు 175 సీట్లు, లోక్ సభలో 25కు 25 సీట్లు వైసిపి గెలుచుకొనే మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?. మన ప్రభుత్వం అందించిన ప్రజా సంక్షేమ పధకాలు కాపాడుకొనేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లోవైరస్ మీద పోరాడుతున్నాను. ..ప్రక్క రాష్ట్రము నుండి వచ్చి ఇక్కడ ప్రజలను మోసం చెయ్యడానికి విష రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, దత్త పుత్రుడు, వదినమ్మలను (పురంధరేశ్వరి ?) ప్రజలు అందరు గమనించాలని, వీరికి ఏపీ తో ఏమిటి పని అని ఆ దుష్టచతుష్టయం పై సం గ్రామానికి ప్రతీ ఒక్క రూ సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రసం గిం చారు. మనకు ఆదర్శమైన రామాయణం , మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో రూపం లో ఇక్కడకు వస్తున్నారు. ఈసారి రాష్ట్రము నుండి చంద్రముఖి పీడను వదిలించేదామని పిలుపు నిస్తున్నాను అన్నారు. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ సీన్ చూస్తుంటే వాళ్లకు జగన్ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, ఇక్కడ జగన్ ఏనాడూ ఒంటరి కాదు. నిజం ఏమిటి అంటే ఇన్ని లక్షల హృదయాల్లో కోట్ల మంది హృదయాల్లోమీ జగన్ మీ గుండెల్లో ఉన్నాడు.ఇప్పడు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఈరోజు కనిపించేది విలేజ్ సెక్రటేరియట్. ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. ప్రతి వార్డు సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రజలకు సంక్షేమ పధకాలు ఇంటి ఇంటికి అందేలా చేసారు మరి ఈ వ్యవస్థ తీసుకొచ్చింది మీ జగన్. మన వైయస్సా ర్ సీపీ.. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *