సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ చరిత్రలో తొలిసారి చందమామపై సరికొత్త ప్రాంతంలో కొత్త ఆవిష్కారణ చెయ్యడానికి చంద్రునిపై దక్షిణ ధ్రువంలో మంచు ,నీరు ఉందని నిరూపించడానికి , భూమి ఆవిర్భావంలో రహస్యాలను ఛేదించేందుకు..అంతరిక్ష ప్రయోగరంగంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేసే.. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం నేడు, శుక్రవారం విజయవంతమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, శ్రీహరికోట ఇస్రో వర్గాల్లో ఆనందం వెల్లువెత్తింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. నేటి మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్‌-3 బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.613 కోట్లు. 3,900 కిలోల బరువు గల చంద్రయాన్‌-3.. ఆగస్టు 23వ తేదీ లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ అవుతుంది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని మోడీ, సీఎం జగన్, ఇతర ప్రముఖులు ఇస్రో’శాస్త్రవేత్తలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *