సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: రేపు మంగళవారం చంద్ర గ్రహణం నేపథ్యంలో భీమవరంలో దేవాలయాలు మూసివేస్తారు. అయితే కార్తీక మాసం నేపథ్యంలో గునుపూడి భీమవరం నందు వేంచేసి యున్న పంచారామ క్షేత్రం..సాక్షాత్ చంద్రుని ప్రతిష్టగా భక్తులు భావించే.. శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం రేపు, మంగళవారం చంద్రగ్రహణం సందర్బముగా ఉదయం గం.10-00లకు మూసి వేసి, తిరిగి బుధవారం సంప్రోక్షణ అనంతరం తెల్లవారుఝామున 4-30లకు తెరుస్తారు. అలాగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఆలయం మూసివేసి మరల తిరిగి బుధవారం ఉదయం అమ్మవారికి సంప్రోక్షణ ఆలయం శుద్ధి చేసి అనంతరం ఉదయం 8:00 గంటలకు ఆలయం తెరుస్తారు. కావున స్వామివారిని, అమ్మవారిని దర్శించే స్థానిక, దూరప్రాంతాల భక్తులు ఆలయాలు తెరిచే సమయాలను గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *