సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెంలో నేడు, బుధవారం ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనతో ఉన్న కొంత మంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం వింటున్నవారు బిత్తరపోయారు. బొలిశెట్టి మాట్లలలో .. ఎన్నికలలో తన కూడా తిరిగినవారే .. తాను ఎన్డీఏ ఎమ్మెల్యేని.. తాను చనిపోతే తాడేపల్లి గూడెం ఉప ఎన్నిక వస్తే.. కొంత మంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారంటూ… వారు ఫై స్థాయిలో చూసుకొంటామని అంటున్నారని ఇది చాల దారుణమైన విషయం అని, అయితే వారి కోరిక తాను నెరవేర్చలేనని, చావడానికి సిద్ధంగా లేనని..తానేమి చేతులకు గాజులు తోడించుకోలేదని, ఎవరు త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు. మూడు పార్టీలు కలిసి తనకు మ్యాండేడ్ ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. తాను గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్నానన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టి.. వారిని బెదిరిస్తే సహించేది లేదని.. తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదన్నారు. కానీ శాసన సభ్యుడిగా మాత్రం గౌరవం ఇవ్వండంటూ కూటమిలోని మిత్ర పక్ష పార్టీ నేతలకు, ప్రభుత్వ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో? అసలు ఎవరు బోలిశెట్టిని చంపుతామని బెదిరించారో తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *