సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై ఎన్నికలలో పోటీచేసేందుకు మహిళలకు మోడీ సర్కార్ పెద్ద పీట వేసింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వే షన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే.. లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33శాతం రిజర్వే షన్లు అమలవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు.. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మం త్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. ఈ సం దర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మం త్రి ధన్యవాదాలు తెలిపారు. సదరు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన లోక్ సభలో మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో తాజా గా మోదీ సారథ్యం లోని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *