సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో నేడు, సోమవారం ఉదయం వరకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుర్నవల్లి, పెసరపాడు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన ఆరుగురిలో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల మరణాలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
