సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెనాలి లో నేడు సోమవారం మాజీ సీఎం జగన్ ఇటీవల నడి రోడ్డుపై పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల రాష్ట్రంలో వైసీపీ నేతలపై అధికార పార్టీ వారి ఆదేశాలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యడంలో పోలీస్ ల వైఖరి వారి దౌర్జన్యాలు ప్రజలు అందరు గమనిస్తున్నారు. తప్పు ఉంటె కేసు పెట్టండి. కోర్ట్ లు చూసుకొంటాయి. అంతేకాని ఇలా చదువుకున్న ఒక దళిత ఇద్దరు మైనారిటీ యువకులను నడి రోడ్డు ఫై కూర్చోబెట్టి, కాళ్ళు ఫై బూటుకాళ్ళతో త్రొకేస్తూ పశువులును బాదినట్లు బాదేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు. ఈ ముగ్గురు యువకులు చదువుకొన్న వారు. కానీ అరాచక శక్తులుగా ప్రచారం చేస్తున్నారు.వారి కుటుంబాలకు ఎంతటి అవమానం పోలీసులు గమనించారా? నిజానికి వారిలో రాకేష్ పాలిటెక్నీక్ చదివాడు. హైదరాబాద్ జొమాటలో పని చేసుకొంటు తెనాలి వచ్చినప్పుడు అతని స్నేహితులు ఇద్దరు సెంటర్ లో కలిశారు. అంతే వారి ముగ్గురిని పట్టుకొని పోలీసులు నడి రోడ్డుపైనే థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇచ్చారు. వీరిలో కరిముల్లా అలియాస్ బాబూలాల్ జూనియర్ అడ్వాకెట్ గా బార్ కౌన్సిల్లో సభ్యత్వంకూడా ఉంది అతనిపై ఎటువం టి కేసులు లేవన్నా రు. ఇక విక్టర్ తం డ్రి మాజీ న్యూస్ రిపోర్టర్.. మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు యువకులపై పోలీసులు కొట్టిన దెబ్బలు సోషల్ మీడియాలో అందరు చూసారు. కానీ కోర్టులో హాజరుపర్చే ముందు గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చెయ్య లేదు? అని ప్రశ్నించారు.. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా..? పోలీసులు డాక్టర్ ను బెదిరించి ఉండాలి..వారిని కొడుతున్న వీడియో రికార్డు చేసింది కూడా కొందరు మంచివారైనా పోలీసులే కావడం వారిని అభినందిస్తున్నాను. కూటమి ఎమ్మెల్యేలు పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. ప్రతి గ్రామంలో మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నా యి.. అన్నింట్లో వాటాలు చం ద్రబాబు, లోకేష్ లకు వెళ్తున్నా యి.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్
