సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు, సోమవారం బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలంటూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ…విద్య అనేది ప్రాథమిక హక్కు అని, చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసు గల బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. బడి మధ్యలో మానేసిన పిల్లలను తల్లిదండ్రులు చొరవ తీసుకుని తిరిగి బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. బాల కార్మికులను పనిలో ఉంచరాదని అన్నారు.
