సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. రాష్ట్రంలో పలు గ్రామాలలో ప్రజా ప్రతినిధులుగా తమ ప్రాధానత్య ను తమ అధికారాలను ప్రభుత్వం తగ్గించివేస్తుందని, గ్రామా అభివృద్ధి కోసం వచ్చిన కేంద్ర నిధులు మళ్లిస్తున్నారని,ఆరోపిస్తూ సర్పంచులు తమ డిమాండ్ల పరిష్కారం కొరకు నేడు, మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కానీ కొంత మంది సర్పంచ్‌లు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. ముందుగా కార్లలో అసెంబ్లీ వద్దకు సర్పంచులు చేరుకున్నారు. భారీ పోలీసుల వలయాన్ని చేధించుకుని ఊహించని విధంగా అసెంబ్లీ వద్దకు సర్పంచులు వచ్చేశారు. దీనితో పోలీసులు ఉలిక్కిపడ్డారు. బారికేడ్లను తోసుకుని లోపలకెళ్లే ప్రయత్నం చేశారు సర్పంచులు. ఈ క్రమంలోనే పోలీసులకు, సర్పంచులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. అక్క‌డికి వ‌చ్చిన పలువురు స‌ర్పంచ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *