సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దాని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో నేడు కుండపోతగా వర్షం కురుస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలలో నేడు, గురువారం చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. భీమవరంలో కూడా ఉదయం నుండి ఇదే తంతు.. మధ్యాహ్నం కొద్దీ సేపు ఎండ ప్రచండంగా ఉన్నపటికీ సాయంత్రానికి వాతావరణం పూర్తీ మసక బారి పోయి వర్షపు తుంపరలుతో చల్లదనం మరోవైపు తీవ్ర ఉక్కబోత తో విచిత్ర పరిస్థితి నెలకొంది. మరో 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని ఉవాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *