సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి శుభవార్త అందింది. గత గురువారం కేరళలో ప్రవేశిం చిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని కలిసివస్తే అక్కడి నుండి వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 రోజులలో విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్రం లో మరో రెండు లేదా 3 రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *