సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మండు వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాలలో ఉదయం పూట 42-44 డిగ్రీలతో ఎండలు మాడు పగలగొడుతుండగా రాత్రి పూట విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నేడు, మంగళవారం విశాఖ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రానున్న నాలుగు రోజల పాటు రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రానున్ననాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని వివరించింది. పంటలు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.ఇక తెలంగాణలో మాత్రం రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి.
