సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త! కరోనా పీరియడ్ తరువాత ఇబ్బందుల పాలయిన పలు ఐటి కంపెనీలు, సర్వీస్ బేస్ కంపెనీలు ఇటీవల మంచి ఫలితాలు రావడంతో దేశంలో చాలాకాలం తర్వాత కాలేజీలలో క్యాంపస్ల కు వచ్చేస్తున్నాయి. అయితే గతంలో మళ్లే ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిర్టిషియల్ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉ‍ద్యో గులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి. అలాగే సివిల్ తదితర కోర్ గ్రూప్ విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్ల బాటలో కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్టీ ఐమైండ్ట్రీ యాక్సెంచర్, వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ ఏకంగా 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్లు ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్గ్రాడ్యుయేట్లను నియమించాలని , విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో కాలజీల క్యాంపస్ బాట పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *