సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి మధ్యాహ్నం వరకు పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన నగరాలలో ఉరికించి కొట్టిన భారత దాడులు . పార్లమెంట్ లో టీవీలలో బోరున ఏడుస్తూ విదేశాలకు ప్రాణ భయంతో చెక్కిసిన పాక్ నేతలు, ఎంపీలు.. అయితే గత సాయంత్రానికి మొత్తం చేంజ్.. చైనా టర్కీ కుట్రలు కావచ్చు.. అమెరికా పెద్దన్న పాత్ర కావచ్చు.. ఆకస్మికంగా ఎదో అదృశ్య శక్తి అడ్డగించినట్లు ..ఎట్టకేలకు భారత్ కు ఎటువంటి క్షమాపణలు, ఉగ్రవాదుల అరెస్టులు అప్పగింతలు లేకుండానే ట్రంప్ మధ్యవర్తిత్వం తో గత కొద్దిరోజుల పాటు భీకరంగా సాగిన భారత్, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. మరోసారి పాకిస్తాన్ ఉగ్ర ముకలు భారత్ ఫై దాడి చేస్తే ఇంతకూ మించిన స్థాయిలో పాక్ ఫై దాడి చేస్తామని ప్రధాని మోడీ ప్రకటన చేసారు. అయితే పాక్ వంకర బుద్ధి గత రాత్రే కాశ్మిర్ లో పలు నగరాలపై డ్రోన్స్ ప్రయోగించడం వాటిని భారత్ సైన్యం విఫలం చెయ్యడం జరిగింది. అయినా భారత్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మేరకు రేపు సోమవారం ఇరుదేశాల మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఎదురుదాడులు చెయ్యకుండా మౌనం పాటించింది. గత శనివారం రాత్రి యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ, నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. శత్రువులను పాకిస్తాన్ లో దాడులు చెయ్యకుండా త్రిప్పి కొట్టామని పైగా శత్రువుల ఏయిర్ బేస్‌లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని పాక్ సైన్యాలు ధ్వంసం చేశామని, . వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేల కూల్చాం.అని.. మేమే విజయం సాధించాము. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ , చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ణతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నా ధన్యవాదాలు’ అని అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే.. చావు తప్పి కన్ను లొట్టపోయిన పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటోంది.
