సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణాన్ని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వివరించాడు. గత జనవరి నెలలో సంక్రాంతి సమయంలో జరిగిన వివాదంలో తన ప్రాణ స్నేహితుడు తనని కొట్టాడని…అప్పట్లో తన బాధ ను తెలియజేస్తూ ఒక వీడియో ను వదిలాడు.. అది బాగా వైరల్ అయ్యింది. అయినప్పటికీ స్నేహితుడు కొట్టిన బాధ వెంటాడుతూనే ఉందని .. ఆ మనస్థాపంతో చనిపోతున్నానని తెలిపాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ స్వగ్రామం నరసాపురం మండలం సీతారాంపురం. నిన్న ఉదయం చెప్పులు, సెల్ ఫోన్‌ను బ్రిడ్జిపై ఉంచి యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు శనివారం ఉదయం రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సెల్ఫీ వీడియో తీసుకుని రామకృష్ణ మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది
