సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇటీవల ప్రతి రోజు ఇంటిటికి ప్రభుత్వం లో భాగంగా తాజాగా వీరవాసరం మండలం చింతల కోటి గురువు గ్రామంలో గడపగడపకు వెళ్లి జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పధకాలు వారివారి కుటుంబాలకు అందిస్తున్న వివరాలు తెలియజేస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొంటున్నారు. పనిలో పనిగా గ్రామస్తుల ప్రతినిధులతో ఒక పెంకుటిల్లు ముందు రచ్చబండ తరహా సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి గ్రామానికి ప్రజలకు ముఖ్య అవసరాలను , పెండింగ్ లో ఉన్న పనులను అడిగి తెలుస్తుకొన్నారు. తదుపరి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి నిర్ణిత గడువులోపు కృషి చెయ్యాలని,నూతన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశాల జారీ చేసారు.
