సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృ ష్ణారెడ్డి నేడు, మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనారోగ్యం తో ఉన్నానని, చూపు తగ్గిందని చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు విజ్జ్ఞప్తి మేరకు మానవతా దృక్పధంతో హైకోర్టు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని , దీనికేఎదో నిర్దోషిగా బయటపడిన చందాన టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్ధం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కాం లో చంద్రబాబు పాత్ర, అవినీతి చాల స్పష్టంగా ఉందని, చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు.మధ్యంతర ‘బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు? కంటి చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చం ద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా .. బయట ఉన్నా మాకు పెద్ద తేడా లేదు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని సజ్జల దుయ్య బట్టారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు. గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. పేదలకు మంచి చేసి ఉంటే చంద్రబాబు కోసం కన్నీళ్లు కారుస్తారు. చంద్రబాబు జైలుకెళితే ఎవరూ బాధపడలేదు.’ రాష్ట్రము ప్రశాంతంగా ఉంది. అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకవేళ పెద్దవయస్సు రీత్యా నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత నవంబర్ 29వ తేదీలోగా తిరిగి చం ద్రబాబు రాజమండ్రి జైలు కెళ్లాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు.
