సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇక ప్రతి సామాన్యుడు ఇంట్లో ఆరోగ్యానికి వాడే హింస లేని మాంసాహారం కోడి గ్రుడ్డు ధర కూడా ఆలా కార్తీకమాసం ముగియగానే తగ్గేదే లే.. అంటూ ఒక్కసారిగా పెరిగిపోయింది.హోల్ సెల్ గానే గుడ్డు ఒకొక్కటి 7 రూ .పలికితే ఇక రిటైల్ గా తొలిసారి 8 రూపాయలు పలుకుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా .. ముఖ్యంగా భీమవరంలో హోల్ సెల్ లో 30 కోడి గుడ్డు ధర 195 నుండి 200 కి చేరిపోయింది. కార్తీకమాసంలో 135 పలికింది. గత 7రోజుల ముందు 180 చేరిపోయింది. నేడు ఆదివారం సుమారు 200పలికింది. అదే స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర కూడా 200 నుండి 220 రూపాయలు పలకడం గమనార్హం. అంటే చికెన్ ధర అలానే ఉంది. అయితే కావాలని ధరలు పెంచలేదని చలికాలం ప్రభావంతో కోళ్లు గుడ్డు పెట్టె ఉత్పత్తి తగ్గిందని, అందుకే రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కేకేలా తయారీలో కోడిగుడ్డుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా గుడ్డు రికార్డు స్థాయిలో ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
