సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత 2నెలలుగా కేజీ స్కిన్ లెస్ బాయిలర్ చికెన్ ధర 200 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉండగా శ్రావణ మాసం ముగిసే సమయానికి ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బ్రాయిలర్‌ చికెన్‌ రూ.280కి అమ్ముతున్నారు. ఫారం కోడి ధర కూడా అదే దారిలో కేజీ రూ.200లకు అమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో కార్తీకమాసం వచ్చేవరకు కూడా చికెన్‌ ధరలు 280- 300 వరకు నిలకడగా ఉంటుందని భావిస్తున్నారు. శ్రావణ మాసం అయ్యిపోవడంతో అయితే అల్లం మినహా అన్ని కూరగాయల ధరలు దిగి వస్తున్నాయి. రిటైల్ మార్కెట్ లో.. టమాటాలు అయితే కేజీ 15 రూపాయలకు క్యాపిసికం కేజీ 50 రూపాయలు లోపు ధరకు దొరుకుతుండగా బంగాళాదుంప, ఉల్లి మాత్రం 35 రూపాయలు పైకి పెరుగుతుంది. చెమ్మ ఉన్న ఉల్లి మాత్రం 25 కే దొరుకుతుంది. వేరుశెనగ మినహా మీగతా వంట నూనె ధరలు కూడా దిగివస్తున్నాయి. వివిధ కంపెనీల సన్ ఫ్లవర్ వంట నూనెలు 102 నుండి 120 ధర లోపు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *