సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం చిత్తూరు నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ( Accident) లో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఇరువారం సర్కిల్ వద్ద జరిగిన ఈ విషాదంలో వేగంగా వెళ్తున్న ఓ కారు వేగంగా వెళ్లి కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు.. కంటైనర్ కిందకు దూసుకు పోవడంతో లోపల ఉన్నవారు బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. నేటి శుక్రవారం తెల్లవారు జాము కర్ణాటకలోని బెంగుళూర్ సమీపంలోని హొసపేట లో జరిగిన కారు క్యాంటం బైకు ఢీ కొన్న ఘటనలో 7గురు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *