సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2015 నవంబర్ 17న చిత్తూరు మేయర్ ఛాంబర్‌లోనే దంపతులు హత్యకు గురైన మేయర్ కటారి హేమలత దంపతుల హత్య కేసులో వారిని హత్య చేసిన ఐదుగురికి ఉరి శిక్ష విధింస్తూ.. తాజగా నేడు, శుక్రవారం చిత్తూరు 6వ ADG కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం.వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్‌లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ళ క్రితం సంచలనం రేపిన ఈ హత్యల కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు మొత్తం 22 మందిపై పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై 2022 నుంచి సాక్షుల విచారణ జరుగుతూ వచ్చింది. ఏ1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2 వెంకటాచపలతి, ఏ3 జయప్రకాష్ రెడ్డి, ఏ4 మంజునాధ్, ఏ5 వెంకటేశ్‌లపై నేరం రుజువైంది. మిగిలిన 16 మందిపై కేసు కొట్టివేశారు. నేటి కోర్టు తీర్పు అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలించారు.
